Gali kuntu | ఝరాసంగం, అక్టోబర్ 15 : రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ శిబిరానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి సోకిన పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందన్నారు. రైతులు ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి పశు వైద్య అధికారుల సలహాలు తీసుకుంటే పశువులను రక్షించుకోవచ్చునని అన్నారు. పశువులున్న ప్రతి రైతు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ జెడీఏ వసంతకుమారి, మండల పార్టీ అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, ఏడీఏలు ఆదిత్య వర్మ, ప్రభాకర్, స్థానిక అధికారులు సునీల్ దత్తు, హర్షవర్ధన్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గోన్నారు.
Kumuram Bheem | కుమ్రం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ