సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆనంద్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి స్థానికులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడలోని ఇద్దరు యువకుల వద్ద సమారు 20 కేజీల గంజాయి పట్టుబడింది.
గంజాయి విక్రయిస్తున్న తులారాం, ప్రేమ్ అనే ఒడిషాకు చెందిన యువకులను స్థానికుల సహాయంతో పట్టుకున్న ఆనంద్ కృష్ణా రెడ్డి స్వయంగా పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.