Toxic Gases | జిన్నారం, ఏప్రిల్ 20 : బొల్లారం పార్రిశామిక వాడలోని రసాయన పర్రిశమలు విడుదల చేస్తున్న విష వాయువులతో ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం వేళల్లో పలు పరిశ్రమల పొగ గొట్టాల నుంచి పెద్ద ఎత్తున రసాయన విషవాయువులను వాతావరణంలోకి విడుదల చేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. దీంతో ఘాటైన వాసనలు, పొగలు కమ్ముకోవడంతో కండ్లలో మంటలతో పాటు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విష వాయువుల ప్రభావం ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో పిల్లలు, వృద్ధులపై తీవ్రంగా పడుతోందన్నారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యంతోనే పర్రిశమలు విచ్చలవిడిగా విష వాయువులను విడుదల చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రసాయన పర్రిశమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?