Legal Services| జహీరాబాద్, అక్టోబర్ 25 : చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ మున్సిపల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జీ కవిత దేవి అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్ధినులు పెద్దలను గౌరవించాలని, చక్కగా చదువుకోవాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి చట్టాలు తోడ్పాడతాయని సూచించారు. బాలికల పట్ల, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారు కఠిన శిక్షలకు లోనవుతారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల చట్టం, పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవిస్తూ, అవసరమైతే తోటివారికి తెలియజెప్పాలని సూచించారు. మీ చుట్టూ బాల్య వివాహ బాధితులు, బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే 1098కి ఫోన్ ద్వారా తెలుపవచ్చని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాస్ కన్నా, సందీప్ కుమార్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమాచారి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Shreyas Iyer: డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. కానీ గాయపడ్డ అయ్యర్.. వీడియో