సిడ్నీ : శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. కానీ ఆ క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ గాయపడ్డాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో అయ్యర్ తన ఫీల్డింగ్ ట్యాలెంట్ చూపించాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాటర్ అలెక్స్ క్యారీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే గాలిలోకి ఎగిరిన బంతి కాస్త.. థార్డ్ మ్యాన్.. బ్యాక్‌వుడ్ పాయింట్ వద్ద పడబోయింది.
This is the kind of fielding we need from Indian fielders. Shreyas Iyer is the standard. pic.twitter.com/O3ZO6rr323
— R A T N I S H (@LoyalSachinFan) October 25, 2025
ఇక బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న అయ్యర్ ఆ బంతిని అందుకునేందుకు వెనక్కి పరుగెత్తాడు. డైవింగ్ చేస్తూ అద్భుతమైన రీతిలో ఆ క్యాచ్ పట్టాడు. కానీ డైవింగ్ చేసి నేలపై పడుతున్న సమయంలో అతని మోచేయి కడుపులో బలంగా తగిలింది. ఆ బాధ తట్టుకోలేక అయ్యర్ కాసేపు అక్కడ ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ నుంచి వెళ్లిపోయాడు. అలెక్స్ క్యారీ 24 రన్స్ చేసి ఔటయ్యాడు.
Shreyas Iyer looked in discomfort immediately after taking a stunning catch. #AUSvIND https://t.co/gR36wFxaWs
— cricket.com.au (@cricketcomau) October 25, 2025