SP Paritosh Pankaj | జహీరాబాద్, ఏప్రిల్ 1 : జహీరాబాద్ టౌన్, రూరల్, కోహిర్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, సిబ్బంది బ్యారక్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ.. హిస్టరీ షీటర్లలను రెగ్యులర్గా తనిఖీ చేస్తూ.. రికార్డులలో అప్ డేట్ చేయాలన్నారు.
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్హెచ్ఓకు సూచనలు చేశారు.
రాష్ట్ర సరిహద్దు పోలీస్స్టేషన్లు అయిన కోహిర్, జహీరాబాద్, చిరాగ్ పల్లి ప్రాంతాల నుండి ఎలాంటివి అక్రమ రవాణా జరగకుండా నిఘా కట్టుదిట్టం చేయాలని డీఎస్పీలకు సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ నిర్వహించాలని, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేసే విధంగా చూడాలని అన్నారు.
ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్హెచ్వోలకు సూచనలు చేశారు. హిస్టరీ షీటర్లు, సంఘ విద్రోహశక్తులు, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, అట్టి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎస్పీ వెంట జహీరాబాద్ డిఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, సీఐ శివలింగం తదితరులున్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి