civil Judge Sowjanya | చట్టాలపై అవగాహనతోనే సామాజిక మార్పు : సీనియర్ సివిల్ జడ్జి సౌజన్య
civil Judge Sowjanya | బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కోసం సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు ఉండటం సరిపోదని, వాటి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కూడా అంతే ముఖ్యమని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ సౌజన్య అన్నారు.
civil Judge Sowjanya | ఝరాసంగం, ఏప్రిల్ 22: చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారానే నేర రహిత, సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ సౌజన్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కోసం సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు ఉండటం సరిపోదని, వాటి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పనిచేసే క్షేత్రస్థాయి అధికారులు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ కార్యదర్శులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కీలక వారధులని, వారు చట్టాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. బాల్య వివాహాలు బాలల హక్కులను కాలరాయడమేనని, వీటిని అరికట్టడంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల పాత్ర కీలకమని తెలిపారు.
బాల్యం చదువుకే పరిమితం కావాలని, పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని స్పష్టం చేశారు. పోక్సో (POCSO)చట్టం, పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే ఈ చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారు. బాధితులకు అందాల్సిన న్యాయం, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జడ్జి సౌజన్య కోరారు.
ఈ సదస్సులో ఎంపీడీవో, ఎంపీవో, సీడీపీవో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also :
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

