Lok Adalat | సిర్గాపూర్, జూన్ 08 : నారాయణఖేడ్‌లోని జూనియర్ సివిల్ కోర్టులో జూన్ 14న నిర్వహించే లోక్ అదాలత్‌ను కక్షీదారులు సద్వినియోగం చేసుకోవాలని సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు ఉన్నట్లయితే వాటిని రాజీ చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీలోపు స్థానిక ఠాణాకుగానీ, కోర్టుకుగానీ ఇరువర్గాల కక్షీదారులు హాజరైతే వారిని కోర్టులో ప్రవేశపెట్టి ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
యాక్సిడెంట్, కోట్టుకున్న కేసులు, చీటింగ్, చిట్‌ఫండ్, భూతగాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, అక్రమ రవాణా, పేకాట, డ్రంకన్ డ్రైవ్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కారం చేసుకోవచ్చని సూచించారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి