Arrest | పటాన్ చెరు, నవంబర్ 9 : అమీన్ పూర్ లో జర్నలిస్టు పై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశామని సీఐ నరేశ్ తెలిపారు. ఆదివారం అమీన్ పూర్లో జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ఈ నెల 8న రాత్రి మూడు గంటల సమయంలో జర్నలిస్ట్ విట్టల్ ఇంటిపై దాడి చేశారని చెప్పారు.
దాడి చేసిన నేరస్తులైన మధు అలియాస్ మధుసూదన్, వంశీ, నల్లమల శివ ప్రసాద్, యుగేందర్, కొత్త సంపత్, కుంచాల బ్రహ్మయ్య, సల్లడి హరీష్, కోడూరి స్వరాజ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.
జర్నలిస్టు ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టడంతోపాటు జర్నలిస్టును తీవ్రంగా కొట్టారు. జర్నలిస్ట్ పై దాడి సంఘటన పోలీసులు ముందు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దాడి చేసిన వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు.
భూ కబ్జాలపై వార్తలు రాస్తే దాడులు…?
ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి ఇండ్లు నిర్మాణం చేస్తున్నారని పత్రికల్లో వార్తలు రాస్తున్నారని దాడి చేసి భయాందోళనకు గురి చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని సమాచారం రావడంతో అమీన్పూర్ తాసిల్దార్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తుండగా కొందరు దాడి చేసిందుకు ప్రయత్నం చేశారు. దాడి చేసిన వ్యక్తులను విచారించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్లో భూకబ్జాలు పెరిగిపోవడం, ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్మకాలు చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.
పోలీసులు సమగ్ర విచారణ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు నిర్భయంగా వార్తలు రాసే జర్నలిస్టులపై దాడులు చేయడం తగదని దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు