Sanganna | ఝరాసంగం, నవంబర్ 9 : 15 సంవత్సరాల వయసులో ఉన్న ఊరు, కన్నవాళ్లు, బంధుమిత్రులను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిన వ్యక్తి 50 సంవత్సరాల తర్వాత తిరిగి తన ఆప్తులను పుట్టిన ఊరును వెతుక్కుంటూ తన ఇంటి వద్దకే నేరుగా చేరుకున్న ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండల పరిధిలోని బొప్పనపల్లి గ్రామంలో జరిగింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కమ్మరి నాగప్ప, తల్లి మోహనమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన సంగన్న సుమారు 50 సంవత్సరాల క్రితం తన 15వ ఏట తన గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి నేటి వరకు గ్రామానికి గాని తన కుటుంబ సభ్యులకి గాని బంధుమిత్రులకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
అక్కడే సొంత ఇంటిని కూడా నిర్మించుకొని..
వెళ్లిన నాటినుండి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావు తాలూకాలో చంద్రగిరి గ్రామంలో స్థిరపడ్డాడు. సంగన్న ఆ ప్రాంతపు మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు సంతానం. అక్కడే సొంత ఇంటిని కూడా నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. అలా చూస్తుండగానే 50 ఏండ్లు కాస్తా రోజుల్లాగే గడిచిపోయాయి. ఈ క్రమంలో సంగన్నకు తన వాళ్లు, తన పుట్టినిల్లు గుర్తుకు వచ్చింది. ఇక వెంటనే సంగన్న తన మూలాలను వెతుక్కుంటూ స్వగ్రామానికి చేరుకున్నాడు. సంగన్న నేరుగా తన ఇంటి వద్దకే వచ్చి కుటుంబీకులను పలకరించాడు. దీంతో ఆశ్చర్యానికి లోనవడం కుటుంబ సభ్యుల వంతైంది. ఇక సంగన్న చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవడానికి కుటుంబసభ్యులు ఆయనను పలు ప్రశ్నలు అడిగారు.
అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని సంగన్నను పలు రకాలుగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా అతను గ్రామంలో ఉన్నప్పటి రోజుల్లోని పెద్దల పేర్లతోపాటు తోటి వారి పేర్లు తన తల్లిదండ్రి, కుటుంబ సభ్యుల పేర్లు అన్ని వివరించాడు. ప్రస్తుతం ఉన్న అన్నదమ్ముల ముఖ కవళికలు ఈయనతో పోలి ఉండటం.. తాను చెప్పిన కొన్ని విషయాలు వాస్తవం కావడం తన ఆధార్ కార్డులో సైతం అప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉండడం వాస్తవానికి దగ్గరగా ఉండడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంగన్నను అక్కున చేర్చుకున్నారు.\

Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు