నిజాంపేట్, జూన్1: మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల వార్త ప్రచురితం కాగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి కూల్చివేశారు. ప్రమాదకరంగా మారిన నీటి ట్యాంకును అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నమస్తే తెలంగాణ దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.