సంగారెడ్డి : సంగారెడ్డిలోని మాతా శిశు సంక్షేమ దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నాయకు లు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం, కే.మల్లేశం ప్రజావా ణిలో జిల్లా అదనపు కలెక్టర్ మంచు నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు.
దవాఖానలో మంచినీటి వసతి కల్పించాలని, ఇన్ పేషెంట్లకు వైద్య పరీక్షల రిపోర్ట్స్ తక్షణమే ఇవ్వాల న్నారు. అలాగే హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రధాన రహదారి నుండి హాస్పిటల్ మెయిన్ గేట్ వరకు రోడ్డు కు ఇరువైపుల వీధి దీపాలు ఏర్పాటు తదిర సమస్యలు పరిష్కరించాలన్నారు.