గుమ్మడిదల, మార్చి 25: సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్‌యార్డు (Pyaranagar Dumping Yard) ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా రైతు జేఏసీ నాయకులు 49వ రోజు రిలే నిరాహరదీక్షలు చేపట్టారు. అలాగే నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, మంభాపూర్ గ్రామాల్లో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
ఈసందర్భంగా జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డిజిల్లా, గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డు (MSW)ను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, సునీతా, మల్లమ్మ, మన్నె రామకృష్ణ, సూర్యనారాయణ, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, బాల్‌రెడ్డి, రమణారెడ్డి,అమ్మగారి రవీందర్‌రెడ్డి,రాంరెడ్డి, సంజీవరెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, కొరివి సురేశ్, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.