Navodaya School | నిజాంపేట్, జూన్ 12 : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నవోదయ పాఠశాల లేకపోవడంతో తమకు నవోదయ పాఠశాల కావాలని ఆ ప్రాంత నాయకులు, మండలవాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట నాయకులు, మండల వాసులు గత 5 సంవత్సరాలుగా మండల నాయకులు, మండలవాసులు ఎదురుచూపులకు తెరపడింది. నవోదయ పాఠశాల ఏర్పాటులో ముందడుగు పడింది.
నిజాంపేట్ మండలానికి నవోదయ పాఠశాల మంజూరు అయినందున గురువారం నారాయణఖేడ్ డివిజన్ ఆర్డీఓ అశోక చక్రవర్తి నిజాంపేట్ మండల పరిధిలోని బాచుపల్లి గ్రామ సమీపంలో 161 జాతీయ రహదారి ప్రక్కన 178 సర్వేనెంబర్లో గల స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మండల తహసీల్దార్ నాగజ్యోతి ఆర్ఐ జాన్సన్ నిజాంపేట్ గ్రామ నాయకులు రాధా కిషన్ పలువురు ఉన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్