Local Body Elections | పటాన్ చెరు, నవంబర్ 22 : శాసనసభకు ఉప ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ స్వగృహంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. శాసనసభకు ఉప ఎన్నిక వచ్చినా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని గుర్తు చేశారు.
గుమ్మడిదల , పటాన్ చెరు మండలంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు తెలుపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచిపోయిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలన్నారు.
సమన్వయంతో పనిచేసి గెలిపే లక్ష్యంగా..
పార్టీ బలోపేతం కోసం పట్టణ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నాయకులంతా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను సమన్వయం చేయాలని కోరారు. గుమ్మడిదల మండలానికి పార్టీ ఇంచార్జీలుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిలను నియమించారు.
పార్టీ పరిశీలకులుగా జిన్నారం మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి, జిన్నారం మండల పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేశం గౌడ్‌ను నియమించారు. పటాన్ చెరు మండలానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్ ఇంచార్జిలుగా నియమించారు. పార్టీ పరిశీలకులుగా తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య, తెల్లాపూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్‌ను నియమించారు. ఈ సమాజంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Dharmaram | ధర్మారం అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్షా కార్యక్రమం ప్రారంభం
Smog | కుభీర్‌ను కమ్మేసిన పొగ మంచు.. ఇబ్బందుల్లో గ్రామస్థులు
Local Body Elections | స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం