Prudhvi Raj | ఝరాసంగం, డిసెంబర్ 4: సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. గురువారం త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
గత మూడు రోజులుగా నిర్వహించిన దత్త, చండీ, గాయత్రి యజ్ఞం గురువారం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణాహుతితో ముగిసింది. మధ్యాహ్నం దత్తాత్రేయ స్వామివారికి మహిళలు, భక్తులు డోలారోహణం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు, థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. భక్తుల రాక నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్, ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేశారు.

Rayapole Mandal | రాయపోల్ మండలంలో రెండు జీపీలు ఏకగ్రీవం.. పల్లెల్లో వేడెక్కిన రాజకీయం
Dasyam Vinay Bhaskar | కేసీఆరే పాలనే తెలంగాణకు రక్షణ : దాస్యం వినయ్ భాస్కర్
La Nina: ఈ శీతాకాలంలో లానినా ప్రభావం 55 శాతం మాత్రమే !