వరంగల్ : తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో రుద్ర మహా మృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మరింత అండగా ఉండేందుకు దేవుళ్ల ఆశీస్సులు ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వంచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దీక్షా దివస్ 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా 6వ రోజున పార్టీ కార్యాలయంలో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, ఉద్యమకారుల పోరాటాన్ని నేటి విద్యార్థులకు, రానున్న తరానికి తెలిపేందుకే 11 రోజుల పాటు కేసీఆర్ దిక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుటున్నట్లు తెలిపారు. రేపు దీక్షా దివస్లో భాగంగా 7వ రోజున బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీ నారాయణ, ఉడతల సారంగపాణి, నాయకులు నరెడ్ల శ్రీధర్, రమేష్, పులి రజినీకాంత్, దూలం వెంకన్న, నయీమొద్దీన్, చంద్రమోహన్, సదాంత్, శ్రీధర్, చందర్, రమేష్, ఖలీల్, విక్రమ్, శ్రీధర్ రావు, దేవమ్మ, లలిత, శ్రీకాంత్ చారి, గౌస్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.