Potholes | గుమ్మడిదల, జూన్ 14 : రహదారి పొడవునా గుంతలు పడి, కంకర తేలి అధ్వాన్నంగా మారింది. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం- జంగంపేట వెళ్లే దారిలో వేసిన తారురోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా మారింది. ఈ దారిలో భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ రోడ్డు మట్టి రోడ్డుగా మారడమే కాకుండా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదకరంగా మారింది.
ఇటీవల రోడ్డు గుంతల మయం కావడంతో అన్నారంకు చెందిన ఒక యువకుడు బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు మట్టి టిప్పర్ ఢీ కొట్టడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అంతేకాదు తరుచూ రోడ్డు మీదుగా ప్రయాణించే బైకర్లకు, కాలినడకన వేళ్లే బాటసారులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
గతంలో ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా ఆధునీకరించినప్పటికి ఈ రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో ఈ దారి మీదుగా ప్రయాణించాలంటే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని వాహనాలు నడిపే దుస్థితి దాపురించింది. ఈ వానాకాలం సీజన్లో కురిసే వానలకు మరింత ఈ ‘దారి’ద్య్రంగా మారుతుందని ఇక్కడి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధింత అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్