Youtuber Vaishnavi | కోరుట్ల, మార్చి 19: కోరుట్ల పట్టణంలోగురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ గంధం వైష్ణవి (20) హత్య కేసు నిందితులను ఉరితీయాలని ఆమె కుటుంబీకులు, బంధువులు గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. వైష్ణవి కుటుంబ సభ్యులుకోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారికి అడ్డుగా కలప దుంగలకు నిప్పంటించి రాకపోకలను స్తంభింపజేశారు.
వైష్ణవిని హత్య చేసిన నిందితులకు ఉరే సరైన శిక్ష అని వైష్ణవి ప్లెక్సీలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిందితుడు హరిబాబు కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలని మేమే తగిన శిక్ష విధిస్తామని ఆందోళన చేపట్టారు.
సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవితో బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా నానా హంగామా సృష్టించారు. హరిబాబు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశామని రిమాండ్‌కు తరలించామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హరిబాబుకు కఠిన శిక్ష పడేలా సాక్షాలు సేకరిస్తున్నామని.. ఆందోళన విరమించాలని కుటుంబ సభ్యులకు సూచించడంతో వారు శాంతించారు. రాస్తారోకో, ధర్నాతో సుమారు గంటపాటు ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి.
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!