చండీగఢ్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శకటం ప్రదర్శనలో కొందరు వృద్ధులు పాల్గొన్నారు. వారు డ్యాన్స్ చేశారు. ఆరోగ్య పథకం ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆ వృద్ధులు భాంగ్రా చేస్తున్నట్లు పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. (Bhangra) ఆ ఆరోగ్య పథకంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రదర్శించిన ఆరోగ్య శాఖ శకటంలో కొందరు వృద్ధులు పాల్గొన్నారు. వారు భాంగ్రా నృత్యం చేస్తున్న వీడియోను పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల ఆరోగ్య రక్షణ పథకం కింద మోకాలి మార్పిడి సర్జరీ చేయించుకున్న ఆ వృద్ధులు ఈ సంబరాల్లో పాల్గొన్నట్లు పేర్కొంది.
కాగా, పంజాబ్‌లోని ప్రతిపక్ష పార్టీలు దీనిపై స్పందించాయి. భాంగ్రా చేస్తూ కనిపించిన వృద్ధులు నిజంగానే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారా అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నించారు. ఆగస్టు 15 పేరుతో జరుగుతున్న అబద్ధాల ప్రదర్శన అని శిరోమణి అకాలీ దళ్ నేత బిక్రమ్‌జిత్ సింగ్ మజీతియా ఆరోపించారు. ఇది ఎలాంటి ఆరోగ్య విప్లవం? అని ప్రశ్నించారు.
మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా దీనిపై స్పందించారు. ‘మన పెద్దలు మనకు గర్వకారణం, రాజకీయ ప్రచారానికి వాడుకునే సాధనాలు కాదు. వృద్ధులతో కెమెరాల ముందు నృత్యం చేయించి, ‘ఆరోగ్య విప్లవం’ లబ్ధిదారులుగా వారిని చూపించారు. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం మాత్రమే కాదు, మన పెద్దల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, పంజాబ్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులను వాడుకోవద్దని సూచించారు.
ਦੇਸ਼ ਦੇ 80ਵੇਂ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਮੌਕੇ ₹10 ਲੱਖ ਵਾਲ਼ੇ ਸਿਹਤ ਕਾਰਡ ਦੀ ਝਾਕੀ ਦੌਰਾਨ ਬਜ਼ੁਰਗਾਂ ਦੇ ਭੰਗੜੇ ਨੇ ਜ਼ਾਹਰ ਕੀਤੀ ਮਾਨ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਦਿੱਤੇ ਜਾ ਰਹੇ ਮੁਫ਼ਤ ਇਲਾਜ ਦੀ ਅਸਲ ਖ਼ੁਸ਼ੀ। ਇਹ ਸਿਹਤ ਸੁਰੱਖਿਆ ‘ਚ ਮਾਨ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਦਿੱਤੀ ਜਾ ਰਹੀ ਬਰਾਬਰਤਾ ਦੀ ਝਲਕ ਹੈ। pic.twitter.com/9Rv4zNwDQi
— AAP Punjab (@AAPPunjab) August 15, 2026