Women Murder | మునిపల్లి, సెప్టెంబర్ 20 : గత ఏడాదిన్నర క్రితం (సుమారు 490 రోజుల క్రితం) మునిపల్లి గ్రామానికి చెందిన అనుసుజ (53) పాపన్నపేట మండలం ఏడుపాయల శివారులో (మే18-2024)న హత్యకు గురైన విషయం తెలిసిందేనని సదాశివపేట సీఐ వెంకటేష్ తెలిపారు. శనివారం మండల కేంద్రమైన మునిపల్లిలో అనుసుజ మృతదేహానికి ఇన్నాళ్ల తర్వాత రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ.. గత ఏడాది మే నెలలో మహిళ అదృశ్యమై అదే నెల మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మహిళ మృతి అనంతరం మృతురాలి కుమారుడితో డీఎన్ఏ పరీక్ష నిమిత్తం వైద్యాధికారులు మృతదేహం నుంచి కావలసిన రక్త నమూనాలను సేకరించి కొడుకు ప్రవీణ్‌కు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. గతంలో అధికారులు నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో తల్లి, కొడుకుకు డీఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కాకపోవడంతో సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన మునిపల్లిలో రెండోసారి మహిళ సమాధి తవ్వి మృతదేహం నుంచి డీఎన్ఏ టెస్టుకు కావాల్సిన ఎముకలను తీసుకెళ్లినట్లు తెలిపారు.
సంగారెడ్డి మెడికల్ కాలేజ్ డాక్టర్ రాము ఆధ్వర్యంలో మహిళ మృతదేహాన్ని బయటకు తీసి డీఎన్ఏ టెస్ట్ కోసం కావాల్సిన పరికరాలను తీసుకున్నట్టు సీఐ వెంకటేశ్ తెలిపారు. సీఐ వెంకటేశ్ వెంట మునిపల్లి తహసీల్దార్ గంగాభవాని, ఎస్ఐ రాజేష్ నాయక్, ఆర్ఐ సుభాష్, గ్రామస్తులు ఉన్నారు.
Katamaya Kits | గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలి
Kothagudem Urban : ‘దసరా పండుగకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు.. 50 శాతం అదనపు చార్జీలు’
Kothagudem Urban : పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలి : దాసరి సారధి