IITH | కంది, మార్చి 29 : సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో పబ్లిక్ హ్యుమానిటీస్ ఇనిషియేటివ్ (పీహెచ్‌ఐ)ను శనివారం ప్రారంభించినట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. డాక్టర్ షుహితా భట్టాచార్జీ నేతృత్వంలో ఈపీహెచ్ఐ ప్రారంభం జరిగింది.
వినూత్న విద్యా అభ్యాసాల ద్వారా క్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించడం, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ మధ్య అంతరాన్ని తగ్గించడం, డిసిప్లినరీ పరిశోధన సంభాషణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పీహెచ్‌ఐ దోహదపడనుంది. ఈ సందర్భంగా లిబరల్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అనుబంధ ఫ్యాకల్టీ ఆఫ్ డిజైన్ డాక్టర్ షుహితా భట్టాచార్జీ మాట్లాడుతూ.. పీహెచ్‌ఐ అనేది సామాజికంగా, రాజకీయంలో కీలకమన్నారు. ఐఐటీహెచ్ పబ్లిక్ హ్యుమానిటీస్ ఇనిషియేటివ్ దేశంలోని అతికొద్ది పబ్లిక్ హ్యూమానిటీస్ హబ్‌లలో ఒకటిగా ఉంటుందని, ఇది దక్షణాసియా సెంటర్స్టేజ్లోని సమస్యలను గుర్తించగలదన్నారు
ఇది మానవీయ శాస్త్రాలు, కళ రూపకల్పన, స్పష్టమైన రూపాంతర ప్రాముఖ్యతను నెలకొల్పుతుందన్నారు. ఐఐటీహెచ్ డెరెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. పీహెచ్‌ఐ ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని, వినూత్న విద్యాపరమైన వాస్తవాలను ప్రపంచాలని చూపించే మార్గం సుగమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రమోద్నాయర్, పుష్పేష్కుమార్, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.