CITU | పటాన్ చెరు, నవంబర్ 13 : బిస్లరీ వాటర్ కంపెనీలో పనిచేస్తున్న అక్రమంగా తొలగించిన కార్మికులను యాజమాన్యం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీ ముందు కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ వాటర్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ వాటర్ కంపెనీ కార్మికులు కండ్లకు నల్లరిబ్బన్ కట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. కార్మికులు యూనియన్ పెట్టుకుంటే తొలగించడం చట్టానికి వ్యతిరేకమని అన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులను సైతం యాజమాన్యం భయభ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు.
కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్న యాజమాన్యానికి కార్మికులు యూనియన్ పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల శ్రమతో యాజమాన్యం పని గడుస్తుందని అన్నారు కానీ కార్మికుల భద్రత సంక్షేమం పట్టడం లేదని అన్నారు. కార్మికులు హక్కులు రక్షణ కోసం ఏకం కావడం తప్పేముందని అన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని లేని పక్షంలో పోరాటాన్ని విస్తృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షులు నాగరాజు కోశాధికారి నవీన్ సిఐటియు నాయకులు రాజు వెంకటేష్ కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Ambati Rambabu | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి కొత్త వీడియో