Vedik Schools | ఝరాసంగం, జూలై 17 : హిందూ దేవాలయాల పరిరక్షణతోపాటు ధార్మిక సేవలు, వైదిక విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ వెల్లడించారు. అన్ని వర్గాల వారికి వేద విద్య అందించాలన్న లక్ష్యంతో ఆశ్రమ పరిధిలో వైదిక పాఠశాలలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
గురువారం ఆశ్రమంలో గత ఆరు సంవత్సరాలుగా వేద శిక్షణ పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించి వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఈ ఏడాది నూతనంగా చేరిన 40 మంది విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం మాట్లాడుతూ…వేద విద్య అనేది సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
యువతలో ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, నందినిగిరి మాత, ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్, కోట శ్రీనివాస్, బి కృష్ణ, నాగన్న పాటిల్, ఎల్లన్న, వైదిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం