నారాయణఖేడ్, మే 8: బైక్‌ను మరో బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం నారాయణఖేడ్ మండలం నాగాపూర్ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అబ్బెంద ఏఈవోగా పని చేస్తున్న సురేష్, నాగాపూర్ తండాకు చెందిన భిక్యానాయక్ బైక్‌పై నారాయణఖేడ్‌కు వెళుతుండగా సీతారాంతండాకు చెందిన కాశీరాం బైక్‌పై అతివేగంగా వస్తూ ఏఈవో సురేష్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో భిక్యానాయక్(62) అక్కడికక్కడే మ్రుతి చెందాడు.
కాగా ఏఈవో సురేష్, కాశీరాంలకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించగా, వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.