Officers | కోహీర్, ఏప్రిల్ 9 : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అధికారుల కొరత వెంటాడుతున్నది. ముఖ్యమైన శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కోహీర్ మండల పంచాయతీ అధికారి వినోద్‌కుమార్ నెల క్రితం సిద్దిపేట జిల్లాకు బదిలీ అయ్యారు. ఇంత వరకు ఆయన స్థానంలో ఎవరూ కూడా విధుల్లో చేరలేదు. దీంతో పంచాయతీల అభివృద్ధి, సమస్యలు, కార్యదర్శుల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయింది.
గ్రామాల సమస్యలు ఎక్కడికక్కడే..
మండలానికి ముఖ్య భూమిక పోషించే ఎంపీవో లేకపోవడంతో ఆయా గ్రామాల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. సూపరింటెండెంట్ అంజయ్య వట్పల్లి మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ శంకర్ కూడా డిప్యూటేషన్‌పై నాగల్గిద్ద మండలంలో విధులు నిర్వహిస్తుండడం విశేషం. మండలానికి పంచాయతీ రాజ్ ఏఈ లేకపోవడంతో సీసీ రోడ్లు, పంచాయతీల భవన నిర్మాణాలు, తదితర పనులు చేయించేవారు కరువయ్యారు.
కవేలి, కొత్తూర్(కే), పీచెర్యాగడి తండా పంచాయతీ కార్యదర్శులు కూడా డిప్యూటేషన్‌పై ఇతర మండలాల్లో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. మండలంలో గ్రామాల సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేయాల్సిన అధికారులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సరిపడా అధికారులు లేక ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మండల పంచాయతీ అధికారి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ రాజ్ ఏఈ, ఎంఈవో, తదితర ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మండల ప్రజలు కోరారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ