Nagireddypet MRO | భూ వ్యవహారానికి సంబంధించిన విషయంలో ఓ తహసీల్దార్ లంచం తీసుకుంటూ అడ్గంగా బుక్కయిపోయాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భూమి విషయంలో నాగిరెడ్డి పేట్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఎమ్మార్వో శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమందించాడు. ఆ వ్యక్తి నుంచి ఎమ్మార్వో శ్రీనివాస్‌కు రూ.50 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలోని అధికారుల బృందం ఎమ్మార్వోను అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.