Drainage Problems | పటాన్చెరు, జూన్ 27 : రోడ్లుపై మురికి రాకుండా డ్రైనేజీలో పడిన చెత్తను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీ, అంబేద్కర్ కాలనీలో పర్యాటించి, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.
వర్షాకాలం ప్రారంభం కావడం జరిగిందని, డ్రైనేజీలో ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీలు జామ్ కావడంతో మురికి నీరు రోడ్లపైకి ప్రవహించి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాలనీలో ఉన్న సమస్యలు కార్పోరేటర్‌కు ప్రజలు వివరించారు. కార్పోరేటర్ వెంట జీహెచ్ఎంసీ మేనేజర్ అరుణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Transformer | ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కానీ కనెక్షన్ మాత్రం మరిచారు.. ముళ్ల పొదల్లో ఇలా