CITU | సదాశివపేట, ఏప్రిల్ 16 : ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూను గెలిపించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం కోరారు. ఇవాళ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎంఆర్ఎఫ్ కార్మికుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీరం మల్లేశం మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందన్నారు. జిల్లాలోని అనేక పరిశ్రమల్లో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ మెరుగైన వేతన ఒప్పందాలు చేస్తున్న చరిత్ర సీఐటీయూకు ఉందన్నారు. కావున రాబోయే ఎన్నికల్లో సీఐటీయూను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ఎంఆర్ఎఫ్ యూనియన్ నాయకులు నర్సింలు, రాజు, రేవనప్ప, బాగారెడ్డి, రమేష్‌రెడ్డి, వెంకటేశం, ఎండీ హజీ, కృష్ణమూర్తి, శాంతకుమార్, విజయవీర్, శివకుమార్, ధన్‌రాజ్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్