IND vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో తమకు తిరుగులేదని చాటుతూ పాకిస్థాన్‌ను మట్టికరిపించింది భారత్. ప్రేమదాస మైదానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్(77) అర్ధ శతకంతో శివమెత్తగా.. బౌలింగ్ దళం విజృంభణతో టీమిండియా లీగ్ దశలో హ్యాట్రిక్ కొట్టింది. ఛేదనలో బుమ్రా(2-17), అక్షర్ పటేల్(2-29) కీలక వికెట్లతో పాక్‌ను పడగొట్టారు. పవర్ ప్లేలోనే నలుగురు ఔటవ్వగా.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగని పాక్‌ను భారత్ ఎనిమిదోసారి చిత్తు చేసింది. ఇకపై పాక్‌తో ‘గ్రేటెస్ట్ రైవర్లీ అనేది ఉత్తమాటే’ అని చాటింది.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో భారత్ అంటే జడుసుకునే పాకిస్థాన్ మరోసారి మ్యాచ్‌ను అప్పగించేసింది. ఆసియా కప్‌లో టీమిండియా చేతిలో చావుదెబ్బతిన్న పాక్.. పొట్టి కప్‌లోనూ ‘మా వల్ల కాదని’ చేతులెత్తేసింది. మ్యాచ్‌కు ముందు ‘మేము అత్యుత్తమ జట్టుతోతలపడాలని అనకుంటున్నా’మని చెప్పిన పాక్ సారథి.. అత్యుత్తమ ఆటను మాత్రం కనబరచడంలో విఫలమయ్యాడు. ఫలితంగా.. ప్రేమదాస స్టేడియంలో భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో దాయది 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుంది.
3️⃣/3️⃣ for #TeamIndia 💙
The #MenInBlue win by 6️⃣1️⃣ runs to qualify for Super 8! 💪
Scorecard ▶️ https://t.co/IgYYH0TeR9 #T20WorldCup pic.twitter.com/hFPqtYIERe
— BCCI (@BCCI) February 15, 2026
చరిత్రను మార్చలేం.. కానీ, గొప్పగా ఆడుతామని బీరాలు పలికిన పాకిస్థాన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ సహిబ్జద ఫర్హాన్(0)ను హార్దిక్ పాండ్యా(1-8) వెనక్కి పంపగా.. జస్ప్రీత్ బుమ్రా(2-17) ఒకే ఓవర్లో ఇద్దరని పెవిలియన్ పంపి దాయాదికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఐదో ఓవర్లో రెండు ఫోర్లు ఇచ్చిన అక్షర్ పటేల్(2-29) సూపర్ డెలివరీతో బాబర్ ఆజాం(5)ను బౌల్డ్ చేసి పాక్‌ను ఒత్తిడిలో పడేశాడు. అంతే.. 34కే పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది.
పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పడిన వేళ పాక్ జట్టును ఆదుకునేందుకు ఉస్మాన్ ఖాన్(44) గట్టిగానే ప్రయత్నించాడు. స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదేస్తున్న అతడిని అక్షర్ బోల్తా కొట్టించగా.. ఇషాన్ రెప్పపాటులో స్టంపింగ్ చేశాడు. ఆ వికెట్లో పాక్ ఆశలు ఆవిరయ్యాయి.
Pakistan never quite recovered from the early jolts as India’s bowlers kept the pressure on consistently with wickets – their biggest win by some distance against Pakistan in the format
👉 https://t.co/1yhhOmNa9u pic.twitter.com/dAoMkV2NJ3
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2026
కాసేపటికే కుల్దీప్ వేసిన లో ఫుల్‌టాస్‌కు షాట్ ఆడిన నవాజ్(4) శివం దూబేకు క్యాచ్ ఇచ్చాడు.. పార్ట్ టైమ్ స్పిన్నర్ తిలక్ ఓవర్లో షాదాబ్ ఖాన్(14) దూబేకే చిక్కడంతో పాక్ ఓటమి ఖాయమైంది. వరుణ్ చక్రవర్తి(2-17) ఒకే ఓవర్లో ఫహీం అష్రఫ్(10), అబ్రార్ అహ్మద్(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. షాహీన్ ఆఫ్రిది(23 నాటౌట్) కాసేపు పోరాడినా.. ఉస్మాన్ తారీఖ్()ను బౌల్డ్ చేసిన పాండ్యా పాక్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. 61 పరుగుల తేడాతో గెలుపొందింది టీమిండియా.
మహా శివరాత్రి పండుగ రోజున పాకిస్థాన్ బౌలర్లను ఉతికేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) పాకిస్థాన్‌పై రెచ్చిపోయాడు. అభిషేక్ శర్మ(0) తొలి ఓవర్లోనే ఔటైనా.. విధ్వంసక ఆటతో విరుచుకుపడిన ఇషాన్ బౌండరీలతో శివాలెత్తిపోయాడు. ఒక్క పరుగుకే డేంజరస్ అభిషేక్ వికెట్ పడడంతో సంబురాల్లో మునిగిన పాక్ జట్టుకు షాకిస్తూ ఇషాన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
A special knock to guide a big victory ✨
Ishan Kishan wins the Player of the Match award in Colombo 🫡
Scorecard ▶️ https://t.co/IgYYH0TeR9 #TeamIndia | #T20WorldCup | #MenInBlue pic.twitter.com/z0EONAxFoq
— BCCI (@BCCI) February 15, 2026
మెరుపు అర్ధ శతకంతో శుభారంభమిచ్చిన ఇషాన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25)లు సమయోచితంగా ఆడారు. ఆఖర్లో శివం దూబే(27), రింకూ సింగ్(11 నాటౌట్) మెరుపులతో టీమిండియా ప్రత్యర్థికి 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.