IND vs PAK : ప్రపంచకప్‌లో భారత్‌పై ఏమంత గొప్ప రికార్డులేని పాకిస్థాన్ జట్టు మరోసారి తడబడుతోంది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగులు ఛేదనలో మొదటి ఓవర్లోనే ఓపెనర్ సహిబ్జద ఫర్హాన్(0)ను హార్దిక్ పాండ్యా(1-8) వెనక్కి పంపగా.. జస్ప్రీత్ బుమ్రా(2-17) ఒకే ఓవర్లో ఇద్దరని పెవిలియన్ పంపి దాయాదికి దిమ్మతిరిగే షాకిచ్చాడు.
ఐదో ఓవర్లో రెండు ఫోర్లు ఇచ్చిన అక్షర్ పటేల్ సూపర్ డెలివరీతో బాబర్ ఆజాం(5)ను బౌల్డ్ చేసి పాక్‌ను ఒత్తిడిలో పడేశాడు. అంతే.. 34కే పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో పాక్ స్కోర్.. 38-4. ప్రస్తుతం ఉస్మాన్ ఖాన్(21 నాటౌట్), షాదాబ్ ఖాన్(1 నాటౌట్) ఆడుతున్నారు. ఇంకా పాక్ విజయానికి 84 బంతుల్లో 138 పరుగులు కావాలి.
Through the gate and BOWLED \|/
Vice-captain Axar Patel with #TeamIndia‘s 4⃣th wicket within the powerplay 👏
Updates ▶️ https://t.co/IgYYH0TeR9 #T20WorldCup | #MenInBlue pic.twitter.com/tsjEcPOhbw
— BCCI (@BCCI) February 15, 2026