MLA Sunitha LakshmaReddy | హత్నూర, ఏప్రిల్ 6 : హత్నూర మండలంలో ఇవాళ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నవాబుపేట, హత్నూర, నస్తీపూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర రెడ్డి, నరసింహారెడ్డి, చంద్ర గౌడ్, ఎల్చాల మధు, మల్లేశం,తోట స్వామి, ధనుంజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.