Veerabhadreshwara Swamy Temple | జహీరాబాద్, ఏప్రిల్ 15 : కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని న్యాల్కల్ మండలం మరియంపూర్ గ్రామ శివారులోని శ్రీ వీరభద్రేశ్వర జాతర ఉత్సవాలకు కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు ఇవాళ జహీరాబాద్ ఎమ్మెల్యే కొన్నింటి మానిక్ రావు హాజరయ్యారు.
ఎమ్మెల్యే మానిక్‌రావు పార్టీ శ్రేణులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు పలు పీఠాధిపతులు డాక్టర్ రాజశేఖర్ శివచార్య, సోమలింగ శివచార్య, ఈశ్వరయ్య స్వామి తదితరులు జాతర ఉత్సవాల్లో పాల్గొని వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బసవరాజ్ వారిని ఘనంగా సన్మానించి వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్, పార్టీ నాయకుడు నరసింహ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సంగ్రం పాటిల్, అశ్విన్ పటేల్, మిథున్ రాజ్, మాజీ సర్పంచులు రవికుమార్, మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు