అమీన్పూర్(జిన్నారం), ఏప్రిల్ 6 : పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తు న్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డి విజన్ పరిధిలోని సాయి అంబికా కాలనీ నుంచి ఐలాపూర్ తాండా వరకు, లాలాబాయి కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రీయల్ ఏరియా వరకు రూ. 3.25కోట్లతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కలిపే రహధారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా నిధులు కేటాయిస్తున్నామన్నారు. నిర్మాణ పనులను నాణ్యతగా, త్వరగా పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌళిక వసతులను కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, ఈఈ సురేష్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.