Drinking Water | ఝరాసంగం, నవంబర్ 10 : మాకు సురక్షితమైన తాగునీరు అందక నెల రోజులవుతుంది.. జర మా సమస్యను పరిష్కరించి తాగునీరందించండి సారూ అంటూ ఆ గ్రామస్తులంతా వేడుకుంటున్నారు. ఈ పరిస్థితి ఝరాసంగం మండలం మచ్నూర్ గ్రామంలో నెలకొన్నది.
మచ్నూర్ గ్రామం 6వ వార్డులో గత నెల రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామంలో ఉన్న బోర్ మోటార్ పాడైపోవడంతో తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. అయితే బడ్జెట్ లేకపోవడం వల్ల బోర్ మోటార్ రిపేర్ చేయడానికి నెల రోజుల నుంచి రెండు నెలలు పట్టవచ్చునని సెక్రటరీ చెప్పడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష