Kranthi Kiran | మా ఆందోల్ నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రమంతా కూడా భూబకాసురులు తయారయ్యారు. ఎవరన్నా కనబడ్డ భూమినో చెరువునో, కుంటనో కబ్జా చేస్తరు.. కానీ మా ఆందోల్ నియోజకవర్గంలో ఏకంగా సింగూరు జలాశయాన్నే కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు భూ బకాసురులుగా తయారయ్యారని మండిపడ్డారు.
మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి సింగూరు జలాశయంలోనే భూ కబ్జాకు తెరలేపాడని ఆరోపించారు. అనిల్ రెడ్డికి సింగూరు జలాశయం దగ్గర ఫాం హౌస్ ఉంది. నిజాం కాలంలో కట్టిన కుంటలను లెవెల్ చేసి కబ్జా చేశారన్నారు. దీనిపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తే కేవలం ఎకరం మాత్రమే కబ్జా అయిందని వారు అంటున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలను కలెక్టర్కు ఇచ్చినా.. మంత్రి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి, చర్యలు తీసుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ నాయకులు భూ బకాసురులుగా తయారయ్యారు.
ఎక్కడైనా కుంటనో, చెరువునో కబ్జా చేస్తారు, కానీ కాంగ్రెస్ నాయకులు ఏకంగా సింగూరు జలాశయాన్ని కబ్జా చేస్తున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి సింగూరు జలాశయంలోనే భూ కబ్జాకు తెరలేపాడు.
అనిల్ రెడ్డికి సింగూరు జలాశయం… pic.twitter.com/0Njssbx1oR
— BRS Party (@BRSparty) June 18, 2026
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!