MLA Chinta Prabhakar | కొండాపూర్, ఏప్రిల్19 : కొండాపూర్ మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇవాళ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అంతటా తిరిగి.. తాను స్వయంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల దీన గాథలను చూసి చలించి పోయి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో పేద ప్రజల పెళ్లిలు చేసి వారి కుటుంబాలకు పెద్ద కొడుకుగా నిలిచారన్నారు. కొండాపూర్ మండలానికి 40 కల్యాణ లక్షీ, 14 షాదీముబారక్.. మొత్తం 54 చెక్కులను పంపిణీ చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు మల్లాగౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మ్యాకం విఠల్, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు రుక్మోద్దీన్, మాజీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు రాంచంద్రయ్య, అంజీరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నాగయ్య, ఇంద్రారెడ్డి, సంతోష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్