Students | ఝరాసంగం, జూలై 17 : ఝరాసంగం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బాలికల గురుకుల పాఠశాలను గురువారం మండల ప్రత్యేక అధికారి లలితకుమారి సందర్శించారు. వంటశాల, ఆహార నాణ్యత, హాజరు శాతంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా..? అనే విషయంపై వంటశాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి సిబ్బందిని ఆదేశించారు.
విద్యార్థుల హాజరు శాతం తగ్గుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆమె 561 మందిలో 46 మంది గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమదేనని, అలాగే హాజరు శాతం పెంపునకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.
విద్యాలయంలో ఏర్పడిన వివిధ సమస్యలను ప్రిన్సిపాల్ ప్రేసిల్ల లలిత కుమారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కూడా ఆమె పరిశీలించారు. అక్కడ వంటశాలను తనిఖీ చేసి, విద్యార్థినులకు అందుతున్న ఆహార నాణ్యతపై అధికారులను, విద్యార్థినులకు అడిగి తెలుసుకున్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం..