పటాన్ చెరు, సెప్టెంబర్ 21: కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారని బీఆర్ఎస్ నాయకుడు,ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం పటాన్చెరు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాపూజీ తెలంగాణ కోసం జీవితాంతం పోరాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంలో ఆయన చూపిన త్యాగం, ధైర్యం, క్రమశిక్షణ ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో వంగరి అశోక్, రఘు రాములు, పశుపతి, జిత రాములు, నన్నవారం వరప్రసాద్, జిట్ల ధరమ్ చంద్, వేముల లక్ష్మణ్, మధు, గీత వెంకట్, ఆందోలే భాస్కర్, దుర్గం కృష్ణ ఉన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో
తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, నికార్సయిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జేఏసీ నే అశోక్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు యాదవ్, ఎంకేవై ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.