Birth Certificate | మునిపల్లి, ఫిబ్రవరి 25 : గ్రామంలో పొరపాట్లు జరిగితే సరి చేయాల్సిన అధికారులే పైసలకు కక్కుర్తి పడి అక్రమంగా పైసలు వసూలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులు గురి చేస్తే ప్రజలు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) కావాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శి వద్దకు పోతే పంచాయతీ కార్యదర్శి దరఖాస్తుదారుడితో రూ.10 వేలకు బేరం కుదుర్చుకొని జనన ధ్రువీకరణ పత్రం అందించేందుకు సంబంధించి పనులు చకచకా చేసిపెట్టాడు. సదరు దరఖాస్తు దారుడికి జనన ధృవ పత్రం మీ సేవలో తీసుకోవాలంటూ చెప్పారు.
ఇంతవరకు అంతా బాగానే ఉంది.. ఇక్కడే ఉంది అసలైన కథ.. ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి జనన ధ్రువీకరణ పత్రం కావాలంటే పైసలు డిమాండ్ చేసి కావాల్సినన్ని పైసలు ఇవ్వడంతో దరఖాస్తుదారుడి వద్ద ఉన్న సర్టిఫికెట్లు పరిశీలించకుండానే జన ధృవీకరణ పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ.. ఖమ్మం పల్లి పంచాయతీ కార్యదర్శి పైసలిస్తే ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తారా..? అని పంచాయతీ కార్యదర్శిపై పలు రకాల విమర్శలు చేస్తున్నారు. దరఖాస్తు దారుడి కుమారుడికి ఇంతకుముందే గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి అందించిన జనన ధ్రువీకరణ పత్రం దగ్గర పెట్టుకొని నూతన సర్టిఫికెట్ కావాలంటే పైసల్ డిమాండ్ చేసి ఫామ్-10పై సంతకం చేసి దరఖాస్తుదారుడికి అందించారు.
ఖమ్మంపల్లిలో పంచాయతీ కార్యదర్శి పైసలు ఇచ్చిన వాళ్లకు ఎలాంటి సర్టిఫికెట్లు అయినా ఇస్తారు.. పైసలు ఇవ్వనివారు ఎవరైనా సరే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఖమ్మంపల్లిలో అక్రమంగా పైసలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!