IND vs SL : గాలే టెస్టులో తొలి రోజే పటిష్ట స్థితిలో నిలిచిన భారత జట్టు(Team India) రెండో రోజు తడబడింది. దేవ్‌దత్ పడిక్కల్(167) భారీశతకంతో మెరిసినా.. మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. వర్షం ప్రభావంతో శ్రీలంక బౌలర్లు పుంజుకోవడంతో స్కోర్ వేగం తగ్గింది. అయితే.. టీ సెషన్లో ధ్రువ్ జురెల్(51), మానవ్ సుతార్(24)లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో పేసర్ ప్రభాత్ జయసూర్య(4-109) వరసగా వికెట్లు తీయడంతో భారత్ ఆలౌట్ అంచున నిలిచింది.
తొలి టెస్టులో భారీ స్కోర్ దిశగా సాగుతున్న భారత జట్టు రెండో రోజు దేవ్‌దత్ పడిక్కల్(167 : 230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) ఔటయ్యాడు. మొట్టమొదటి సెంచరీతో భారత జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేసిన ఈ కుర్రాడు రెండో రోజు లంచ్ తర్వాత వెనుదిరిగాడు. ఓవర్ నైట్ స్కోర్ 288/2తో ఆట మొదలెట్టిన టీమిండియా.. చూస్తుండగానే రిషభ్ పంత్(39), కేఎల్ రాహుల్(82) వికెట్లు కోల్పోయింది. వెంటవెంటనే ఇద్దరూ కీలక ప్లేయర్లు ఔటైన వేళ.. ధ్రువ్ జురెల్(51) ఇన్నింగ్స్ నిర్మించిన పడిక్కల్.. డబుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో ఆగిపోయాడు.
That will be Stumps on Day 2 in Galle!
A strong batting display from #TeamIndia as they reach 460/9 💪
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/pKakUsHrpB
— BCCI (@BCCI) August 16, 2026
అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(13) విఫలమైనా.. జురెల్ ఆచితూచి ఆడాడు. లహిరు కుమార ఓవర్లో మానవ్ సుతార్(24) బౌండరీతో స్కోర్ నాలుగొందలు దాటింది. అర్ధ శతకం సాధించిన జురెల్‌ను ప్రభాత్ జయసూర్య కాసేపటికే సుతార్‌ను డగౌట్ చేర్చాడు. సిరాజ్ త్వరగా వెనుదిరిగినా కుల్దీప్ యాదవ్(12 నాటౌట్) పట్టుదలగా ఆడాడు. ప్రసిధ్ కృష్ణ(1 నాటౌట్) కూడా వికెట్ కాచుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి భారత్ 460 పరుగులు చేసింది.
Half-century for Dhruv Jurel!
He brings up his second FIFTY in Test Cricket 👏👏
Fifty partnership 🆙 between Dhruv Jurel & Manav Suthar 🤝
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/FgaEUy30i0
— BCCI (@BCCI) August 16, 2026