Road Construction | కాంగ్రెస్ నాయకులే రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేపడితే.. నాకేం సంబంధం లేదంటున్న అధికారి..!
Road Construction | సోమవారం మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం నుంచి చౌరస్తా వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పనులు పరిశీలించేందుకు వచ్చిన పంచాయతీ రాజ్ అధికారులు రోడ్డు క్యూరింగ్ సరిగ్గా లేనప్పటికి దగ్గర ఉండి డాంబర్ వేయించడం ఆశ్చర్యంగా ఉంది.
Road Construction | మునిపల్లి, ఏప్రిల్ 13 : ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలు కలిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులే రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేపడితే ఏలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామంలో నూతంగా నిర్మాణం చేపడుతున్న డాంబర్ రోడ్డును చూస్తే తెలుస్తుంది. రోడ్డు నిర్మాణం చేపడితేనే బిల్లులు మంజురవుతాయని చెప్పే అధికారులే నాణ్యత లోపించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు కంటికీ కనిపిస్తున్నా మాకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు.
సోమవారం మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం నుంచి చౌరస్తా వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పనులు పరిశీలించేందుకు వచ్చిన పంచాయతీ రాజ్ అధికారులు రోడ్డు క్యూరింగ్ సరిగ్గా లేనప్పటికి దగ్గర ఉండి డాంబర్ వేయించడం ఆశ్చర్యంగా ఉంది. రోడ్డుపై తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి రోడ్డు నిర్మాణం చేసేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని స్థానికులు అధికారుల తీరుఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నా.. సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపడుతుంటే చూస్తూ ఉండి పోయిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతలేని రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వస్తున్న విమర్శలపై సంబంధిత అధికారిని వివరణ కోరగా నాకేం సంబంధం లేదన్నట్టు సమాధానం ఇస్తూ, రోడ్డు ఇలాగే వేస్తారు అని ఎటకారంగా వివరణ ఇవ్వడం గమనార్హం.
Read Also :
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

