ఒడిశా టు హైదరాబాద్.. ఆపరేషన్ భోలా!
తెలంగాణ ఈగల్‌ఫోర్స్ అధికారులు ‘ఆపరేషన్ భోలా’ పేరుతో భారీ డ్రగ్స్ నెట్వర్ను ఛేదించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్‌పై ఏకకాలంలో దాడులు చేపట్టి సుమారు 100 మంది వినియోగదారులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఈగల్‌ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మీడియాకు వివరాలు వెల్లడించారు.
- డ్రగ్స్ నెట్వర్ను ఛేదించిన ఈగల్‌ఫోర్స్
- 31 మంది క్యారియర్లు, 30 మంది వాడకందారులు
- 100 మంది అరెస్టు.. 80 మందికి పాజిటివ్
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఈగల్‌ఫోర్స్ అధికారులు ‘ఆపరేషన్ భోలా’ పేరుతో భారీ డ్రగ్స్ నెట్వర్ను ఛేదించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్‌పై ఏకకాలంలో దాడులు చేపట్టి సుమారు 100 మంది వినియోగదారులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఈగల్‌ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మీడియాకు వివరాలు వెల్లడించారు. బాలానగర్‌లో వెలుగు చూసిన భోలా బ్రదర్స్ గంజాయి సరఫరాపై లోతుగా ఆరా తీసిన ఈగల్‌ఫోర్స్.. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా అటవీ ప్రాంతాల నుంచి విజయనగరం జిల్లా పాచిపెంట మీదుగా హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాలకు ఈ నెట్వర్క్ విస్తరించినట్టు గుర్తించింది. వాట్సాప్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేయడం, ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించడం, అనంతరం డెడ్‌డ్రాప్ పద్ధతిలో గంజాయి పొందుతున్నట్టు గుర్తించింది.
కోరాపుట్ జిల్లా నుంచి డ్రగ్స్‌ను తరలించేందుకు 31 మంది క్యారియర్లను వినియోగిస్తున్నట్టు ఈగల్‌ఫోర్స్ గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌లో 230 మంది వినియోగదారులను గుర్తించినట్టు ఈగల్‌ఫోర్స్ తెలిపింది. నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు టాస్‌ఫోర్స్, హెచ్ఎన్ఈడబ్ల్యూ సిబ్బంది సహకారంతో ఏకకాలంలో 188 లక్ష్యాల మీద గురి పెట్టి ఈ నెల 12-13 మధ్య రాత్రి ఆపరేషన్ భోలా ప్రారంభించారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఐదుగురు డ్రగ్స్ కింగ్‌పిన్‌లను గుర్తించి చర్యలు తీసుకున్నారు. వారిలో సంజయ్ మారి, కామేశ్ మారి, దంబు ఖోరా, అనసు ఖరా, సేతి రాకేశ్ ఉన్నారు. వారిలో ఒకరు బాలుడు కావడంతో నోటీసు ఇచ్చి విడుదల చేసినట్టు ఈగల్‌ఫోర్స్ తెలిపింది. మరోవైపు 180 మంది వినియోగదారుల్లో 100 మందిని పట్టుకున్నారు. వీరిలో 80 మందికి డ్రగ్స్ వినియోగం నిర్ధారణ కాగా, వారిలో 38 మందిని మెజిస్ట్రేట్ ఆదేశాలతో డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- drug
- drug network
- Eagle Force
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

