టైటిల్ నుంచే సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతుంటారు దర్శకుడు అనిల్ రావిపూడి. తొలి సినిమా ‘పటాస్’ నుంచి చూస్తే.. ఆయన టైటిల్స్ అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ప్రస్తుతం ఆయన వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాక్కూడా ఆయన భిన్నమైన పేరునే నామకరణం చేసినట్టు తెలుస్తున్నది.
ఇది రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు ‘బాల్‌రెడ్డి బామ్మర్ది’ అనే క్యాచీ టైటిల్‌ని అనిల్ ఖరారు చేశారట. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్‌రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నది. షైన్ స్క్రీన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.