Crop yields | మనూరు, జులై 5 : రైతులు పంట దిగుబడి రావాలంటే కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ అన్నారు. శనివారం మనూరు మండల పరిధిలోని రాణాపూర్, అతిమ్యాల్ గ్రామాల శివారులో పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పత్తి పంట సాగు చేసినప్పటి నుంచి 48 గంటలలోపు పత్తి పంటలో కలుపు నివారణ మందు.. పెండిమితాలిన్ ఎకరాకు 700మిల్లీమీటర్ మందును పిచికారి చేయాలని అన్నారు.
కలుపు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పంట దిగుబడి అధికంగా సాధించవచ్చునని అన్నారు. దీంతోపాటు గుంటుకలు తోలడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుందని.. దీని ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు. అదే విధంగా రైతుల విశిష్ట గుర్తింపు కార్డులు చేసుకోవాలని, వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ యోజన, పంటల భీమా, మౌలిక సదుపాయల కల్పన సహా పలు పథకాలు అమలవుతాయన్నారు. వీటన్నింటికి గుర్తింపు కార్డుల కోసం గ్రామాల్లో ఫార్మర్ రిజిష్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు రైతులు ప్రతీ ఒక్కరు వారి వారి పేర్లతో రిజిష్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే 19 రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. ఫార్మర్ రిజిష్ట్రేషన్ కోసం మండల వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహేష్ చౌహన్, ఏఈఓలు ప్రవీణ్ కుమార్, సంధ్యా, రైతులు పాల్గొన్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు