Health tips | మీలో ఈ లక్షణాలను గమనిస్తున్నారా.. కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
Health tips | మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కిడ్నీలు () కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా విసర్జింపజేయడం కిడ్నీల ప్రధానమైన విధి. కిడ్నీల పనితీరు క్షీణించి, శరీరంలోని టాక్సిన్ల తొలగింపు విధులను సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ సమస్యలు వస్తాయి.
Health tips : మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో కిడ్నీలు (Kidneys) కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసి, మూత్రం ద్వారా విసర్జింపజేయడం కిడ్నీల ప్రధానమైన విధి. కిడ్నీల పనితీరు క్షీణించి, శరీరంలోని టాక్సిన్ల (Toxins) తొలగింపు విధులను సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ సమస్యలు (Kidney problems) వస్తాయి. అయితే కిడ్నీల పనితీరు 90% క్షీణించే వరకు లక్షణాలు కనపడకపోవచ్చు. పనితీరు బాగా తగ్గిన తర్వాత మాత్రమే లక్షణాలు కనపడతాయి. కిడ్నీ పనితీరు సక్రమంగా లేనప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యూరిన్లో రక్తం : మూత్రంలో రక్తం కనిపించడం లేదా యూరిన్ రంగు కాఫీ రంగులో కనిపించడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతంగా అనుమానించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చిన్నప్పుడే హైబీపీ : చిన్న వయస్సులోనే రక్తపోటు పెరగడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
రాత్రిళ్లు అతిగా యూరిన్ : రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం కూడా కిడ్నీ పనితీరు తగ్గి్ందనడానికి సంకేతంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అన్నం సహించకపోవడం : కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వాంతులు అవుతాయి. అన్నం సహించదు. శరీరంలో దురదలు వస్తాయి.
కాళ్లు, ముఖం ఉబ్బడం : కిడ్నీలు మలినాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతే శరీరంలో ద్రవం నిల్వలు పేరుకుపోతాయి. దాంతో కాళ్లు, ముఖం శరీరంలోని ఇతర భాగాలు నీరు నిండి ఉబ్బుతాయి.
శ్వాస సమస్యలు : కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవాల నిల్వలు పేరుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శ్వాస ఇబ్బందిగా మారడం కూడా కిడ్నీ వైఫల్యానికి సంకేతంగా భావించవచ్చు.
గమనిక : పై లక్షణాలు కనిపించినంత మాత్రాన కిడ్నీలు వైఫల్యం చెందినట్లు కాదు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సంబంధిత వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. దానివల్ల ఒకవేళ సమస్య ఉంటే మరింత తీవ్రం కాకముందే చికిత్స తీసుకోవచ్చు. సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కిడ్నీల పనితీరును మెరుగుపర్చుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

