Bhu bharathi Conference | కంది, జూన్ 2 : కంది మండలంలో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రవికుమార్ సూచించారు. షెడ్యూల్ వారిగా గ్రామాల్లో జరిగే సదస్సులలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ నెల 3న బ్యాతోల్, 4న చిద్రప్ప, 5న ఎద్దుమైలారం, ఎర్ధనూర్, 6న ఇంద్రకరణ్, 9న జుల్కల్, కలివేముల, 10న కౌలంపేట్, కాశీపూర్, 11న మామిడిపల్లి, మక్తఅల్లూర్, 12న ఉత్తర్పల్లి, తోపుగొండ, 13న కందిరెడ్డిగూడెం, 16న కంది, 17న చెర్యాల్, 18న ఆరుట్ల గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి