Sangareddy | గుమ్మడిదల, ఆగస్టు 6: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మునిసిపాలిటీ పరిధిలోని అన్నారం శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సమీపంలోని ఇటుక బట్టీల్లోని కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో సమీపంలోని ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలియగానే జీడిమెట్ల, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఉత్పత్తులతో పాటు కోల్డ్ స్టోరేజికి చెందిన వస్తువులు చాలా వరకు కాలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా పరిశ్రమకు చెందిన యాజమాన్యం ఇంతవరకు అందుబాటులో లేరు.
Fire Accident2