BRS Rajatotsava Sabha | ఝరాసంగం, ఏప్రిల్ 26 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులను భారీగా తరలించేలా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమవుతున్నారు. సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా ఇప్పటికే జోన్లవారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారని తెలిసిందే.
కాగా ఆదివారం బీఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ పార్టీ శ్రేణులు, ప్రజలను కోరారు. ఝరాసంగం మండలంలోని ప్రతీ గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలివెళ్లి విజయవంతం చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత, రైతన్నలు ఇలా ప్రతీ ఒకరు, గులాబీ సైనికులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, జహీరాబాద్ శాసన సభ్యుడు కొనింటి మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మండల అధ్యక్షుడు వెంకటేశం నేతృత్వంలో ఝరాసంగం మండలం నుంచి పెద్ద ఎత్తున సభకు తరలి రావాలన్నారు. స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా గులాబీ జెండా అని అన్నారు. మన జెండా.. మన కేసీఆర్.. మన రాష్ట్రం అంటూ నినదించారు.
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా