Irrigation water | నారాయణరావు పేట, మార్చి 11 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి సాగు నీరందక రైతులు బోరుమంటున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి.
తాజాగా రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోదండరావుపల్లి, బంజేరిపల్లి రైతులు ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి పంటలకు సాగునీరు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అధికారులు పట్టించుకోని నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
Read Also :
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Chhaava Movie | నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ విధ్వంసం